తిరిగి
నిపుణుల కథనాలు
చక్కని పంట ఎదుగుదలకు సంరక్షణాత్మక దున్నడం

అతి తక్కువ దుక్కి/కనీస సాగు విధానమేంటి?

అతి తక్కువ దుక్కి/కనీస సాగు విధానమేంటి?

కనీస సాగు లేదా సంరక్షణాత్మక దున్నడం అనేది నేల సాగు విధానం. ఇందులో అంతర్‌పంట నిర్వహణ పనులు తగ్గుతాయి.అంతే కాదు తదుపరి పంట నాట్లు వేసేంత వరకు పంట అవశేషాలు పొలంలోనే ఉండిపోతాయి. కనీస సాగు విధానం ద్వారా గోధుమ, మొక్కజొన్న సాగు చేసే రైతులు మంచి దిగుబడి సాధించినట్టు అనేక అధ్యయనాలు తెలిపాయి.

undefined

సాగు నిర్వహణను రైతులు ఎందుకు తగ్గించుకోవాలి?

సాగు నిర్వహణను రైతులు ఎందుకు తగ్గించుకోవాలి?

నేల నిరంతర సాగు కారణంగా గాలి, నీరుతో భూమి కోతకు గురవుతుంది. దున్నే విధానం కారణంగా కూడా నేల స్వరూపానికి నష్టం కలిగి నీరు ఎక్కువ ఆవిరయ్యేలా చేస్తుంది.

కనీస సాగు విధానానికి విజయవంతమైన ఉదాహరణలు ఉన్నాయా?

కనీస సాగు విధానానికి విజయవంతమైన ఉదాహరణలు ఉన్నాయా?

ఉత్తర భారతంలో చాలా చోట్ల గోధుమ సాగును సీడ్ డ్రిల్ విధానంలో చేపడతారు. బిహార్, ఆంధ్రప్రదేశ్ లో వరి పంట కోసిన తర్వాత నేలలో మిగిలిన తేమను బట్టి మొక్క జొన్నను సాగు చేస్తారు. నేలను ఎక్కువ దున్నకుండానే పప్పు ధాన్యాలు నాటుతారు. ఈ అన్ని పరిస్థితుల్లో రైతులు చక్కని దిగుబడి అందుకున్నారు.

కనీస సాగుకు మెషినరీ అందుబాటులు ఉంటుందా?

కనీస సాగుకు మెషినరీ అందుబాటులు ఉంటుందా?

దీని కోసం వ్యవసాయ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. సీడ్ డ్రిల్స్, ఫెర్టిలైజర్ డ్రిల్స్ వంటి పరికరాలు ఎన్నింటినో రైతులకు అందుబాటులోకి తెచ్చాయి.

కలుపు మొక్కల పెరుగుదల వలన ఏమైనా సమస్య ఉంటుందా?

కలుపు మొక్కల పెరుగుదల వలన ఏమైనా సమస్య ఉంటుందా?

రైతులు అంతర్ కృషి చేస్తుంటే కలుపు మొక్కల ప్రభావం వలన నేల చెదిరిపోయి కలుపు సంహారిణిల ప్రభావం ఉండదు.

కనీస దక్కి ద్వారా కలిగే ప్రయోజనాలు

కనీస దక్కి ద్వారా కలిగే ప్రయోజనాలు

  1. తదుపరి పంటకు దున్నే సమయం తగ్గుతుంది కాబట్టి త్వరగా పంటు సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చు.
  1. నేలను సిద్ధం చేసే ఖర్చులు తగ్గిపోతాయి కాబట్టి దాదాపు 80% వరకు పొదుపు చేయవచ్చు.
  1. నేల తేమను ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చు సాగునీటి సంఖ్యను తగ్గించుకోవచ్చు.
  1. కనీస సాగు ద్వారా సీజన్ తర్వాత పంటల అవశేశాలు , సేంద్రీయ పదార్ధాలు నేలకు చేరుతాయి.
  1. కనీస సాగు ద్వారా నేల ఒరిపిడి తగ్గి నీటి నష్టాలకు కోత పడుతుంది. నేలకోతను నివారించవచ్చు.
  1. మట్టి పటిష్టంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఒరిపిడి ఉండదు కాబట్టి సూక్ష్మజీవులు, వానపాములకు అది సురక్షితంగా ఉంటుంది.
  1. పర్యావరణపరంగా సురక్షితం గ్రీన్ హౌజ్ ప్రభావం తగ్గుతుంది
undefined
undefined

కనీస సాగు ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులు పరీక్ష చేసి తెలుసుకోవచ్చు .దీని కోసం వారు తమ పొలంలో పావు లేదా అర ఎకరం పరీక్షించుకొని కనీస సాగు విధానంతో కలిగే ప్రయోజనాలను గమనించాలి. దాంతో వారు సంతృప్తిత చెందితే వారు ఎక్కువ పొలాన్ని తీసుకోవచ్చు.

ఈ కథనాన్ని చదివినందుకు ధన్యవాదాలు, మీరు వ్యాసాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేశారని మరియు ఇప్పుడు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కథనాన్ని భాగస్వామ్యం చేయాలని మేము ఆశిస్తున్నాము!

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button