తిరిగి
నిపుణుల కథనాలు
మొక్కజొన్నలకు వ్యాపించే డౌనీ బూజు తెగులు (డౌనీ మైల్డ్ డ్యూ) నివారణ

వ్యాధి:

వ్యాధి:

బూజు తెగులు (డౌనీ మైల్డ్ డ్యూ), పెరెనోస్లెరోస్పొరా సోర్ఘీ ద్వారా వ్యాపించే ఒక శిలీంధ్ర వ్యాధి. ప్రాథమికంగా అడపాదడపా వానలు కురుస్తున్నప్పుడు, గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు, చలజన్య బీజాలతో లేత మొక్కల ఆకులు, కాడలు దెబ్బతీస్తూ మొక్కలను నాశనం చేయగలదు లేదా గణనీయంగా దాని దిగుబడి తగ్గించగలదు. రెండో మార్గంగా, తెగుళ్లు సోకిన మొక్కల నుండి శిలీంధ్ర బీజాలు వర్షపు నీరు, గాలి ద్వారా కొత్త మొక్కలకు సోకవచ్చు. చెఱుకు, జొన్నలు , గడ్డి లాంటివి వ్యాధి కారకాలు కవాచ్చు.

లక్షణాలు:

లక్షణాలు:

◙ డౌనీ మైల్డ్ డ్యూ లక్షణాలు 10 రోజుల పంటలపై చూపుతాయి

◙ మొదటి లక్షణంగా లేత ఆకులపై భాగంలో పసుపు రంగు చారలు ఏర్పడతాయి. అన్ని ఆకులపై చారల పరిమాణాలు పెరిగిపోతూ, చివరికి వాడిపోతాయి.

◙ పొలంలో క్రమక్రమంగా మొక్కలు తెల్లగా అయిపోవడాన్ని బట్టి తెగులు సోకిందని నిర్ధారించుకోవచ్చు, డౌనీ శిలీంధ్ర తెగులు ఆకుల కింది భాగంలో వ్యాపించవచ్చు.

undefined

◙ మొక్క పెరిగే కొద్దీ, ఆకులు చిన్నవి, గోధుమ రంగులోకి మారుతూ, పైకి లేస్తూ, ఎండిపోతాయి

◙ తర్వాతి దశలలో, కుచ్చులు వికారంగా తయారవుతూ తీవ్ర లక్షణాలు చూపుతాయి

◙ పూత దెబ్బతిని, కండెలు బలహీనమైపోతుంది.కొన్నిసార్లు ఐరన్ లోపాన్ని కూడా బూడిద తెగులు ఏర్పడిందని కూడా రైతులు పొరబడుతుంటారు కొన్నిసార్లు ఐరన్ లోపాన్ని కూడా బూడిద తెగులు ఏర్పడిందని కూడా రైతులు పొరబడుతుంటారు.

డౌనీ మైల్డ్ డ్యూతెగులు మరియు ఐరెన్ లోపం లక్షణాల మధ్య కింది తేడాలు ఉంటాయి:

డౌనీ మైల్డ్ డ్యూతెగులు మరియు ఐరెన్ లోపం లక్షణాల మధ్య కింది తేడాలు ఉంటాయి:

◙ ఐరన్ లోపం ఉన్నప్పుడు తెల్లని చారలతో తెల్లని మొక్కలు పొలమంతా విస్తృతంగా ఏర్పడితే, డౌనీ మైల్డ్ డ్యూ తెగులు అక్కడక్కడా కొన్ని మొక్కలు మాత్రమే తెల్లగా అవుతాయి.

◙ ఐరోన్ లోపం ఉండే మొక్కల్లో లాగా బూడిద తెగులు తెల్లని మచ్చలు ఆకులు కింది భాగంలో కనిపించవు (బూడిద మచ్చల పెరుగుదల గమనించడానికి ప్రతి రోజూ పొద్దున వేళలో పరిశీలించండి) నియంత్రణ పద్ధతులు

◙ సిఫార్సు చేసిన మోతాదులో మెటలాక్సిల్ 70%WP లేదా మెటలాక్సిల్ 31.8% ES విత్తనంపై పిచికారి చేయడం

◙ వ్యాధికారక శిలీంధ్రాలు సోకిన ప్రారంభ దశలోని మొక్కలను పీకేసి, వాటిని తగలబెట్టడం వలన ఆ తెగులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు

◙ విత్తనాలు విత్తిన తర్వాత 10-15 రోజులకు లీటరు నీటిలో @2.5 గ్రాములు మెటలాక్సిల్ +మాంకోజెబ్ కలిపి పిచికారి చేయడం (అవసరమైతే, 25 రోజుల త్రవాత అదే మోతాదుతో రెండవసారి పిచికారి చేయాలి)

◙ 1 లీటరు నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 18.2% + డిఫెనొకొనాజోల్ 11.4% 0.3 గ్రాములు కలిపి పిచికారి చేయాలి. మొక్కల మధ్య తగినంత ఖాళీ వదిలి, తక్కువ సంఖ్యలో వేసి, క్రమానుగతంగా ఎరువులు వాడాలి

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button
app_download
stars ఇతర ఉచిత ఫీచర్లు stars
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి