తిరిగి
నిపుణుల కథనాలు
నేను సేధ్యపు భూమిలో చెరువును ఎలా నిర్మించాను-ప్రగతిశీల రైతు

“నా పేరు పాండురంగ్ ఈనామి, నేను ఔరంగాబాదుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్మ పౌథాన్ తాలూకాలో నివసిస్తున్నాను. మా ప్రాంతం ఎంతో వర్షాధారమైన ప్రాంతం. కానీ ప్రత్తి, మొక్కజొన్న నిమ్మ తోటలను పెంచడానికి తగినంత వర్షపాతం ఉంటుంది. నేను 2000 - 2003 సంవత్సరాలలో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొన్నాను. భూగర్భ జలాలు కూడా అరుదుగా ఉన్నాయి మరియు వేసవి కాలంలో పూర్తిగా ఎండిపోతున్నాయి. అందువలన వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి ఒక వ్యవసాయ చెరువును నిర్మించాలని నేను అనుకున్నాను,అందువలన బోర్ వెల్ లోని భూగర్భ జలాలకు పునరావేశం కల్పించినట్లవుతుంది. ఆ సమయంలోనే, నేను హైదరాబాద్ లోని, ఇక్రిసాట్ (ICRISAT) శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను, అక్కడ నీటిని వ్యవసాయ చెరువుల ద్వారా సమర్థవంతమైన రీతిలో నిల్వ చేయవచ్చని నేను తెలుసుకున్నాను, ర్తుతువులు మారిన తర్వాత అవసరమైనప్పుడు ఆ నీటిని వ్యవసాయ క్షేత్రాలకు నీటిపారుదల ద్వారా ఉపయోగించుకోవచ్చు.”

“వారి ఉదాహరణలను తీసుకొని, నేను వ్యవసాయ చెరువు నిర్మాణ పనిని ప్రారంభించాను. వ్యవసాయ చెరువును నిర్మించడానికి అనువైన చోటునుండి నీటి పారుదల కు అనుకూలంగా ఉండాలి, ఇది చాలా ముఖ్యమైనది. అకక్డ నుండి నీటిని పంటలకు మళ్ళించుకోవచ్చు. భూమి త్రవ్వకాన్ని మరియు మట్టిని తరలించడానికి కూలి ల తో లేదా ట్రాక్టర్ల వంటి యంత్రాలతో సాధించవచ్చు.

మట్టి యొక్క త్రవ్వకం ట్రాక్టర్-ఆపరేటెడ్ లెవలర్ సహాయంతో సమర్ధవంతంగా చేయబడుతుంది. మట్టి త్రవ్వకం చెరువు యొక్క ఒక చివరి వైపు నుండి ప్రారంభించి మరొక వైపు కు చేరే వరకు చెయ్యవచు . కావలసిన లోతు వరకు మట్టిని తీసివేయండి. గట్లను మట్టితో నింపడం కాకుండా కత్తిరింపులతో జలాశయాలను కావలిసిన ఆకృతి చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ఇది మంచి చెరువు దీని వలన చెరువు గట్లు గట్టిగ ఉంటాయి. "

undefined
undefined
undefined

ఒక 100x100x12 క్యూబిక్ అడుగుల చెరువు త్రవ్వటానికి మార్కెట్ విలువ రూ. 80,000 నుండి రూ. 90,000 వరకు ఉంటుంది కానీ కొన్ని పథకాల ద్వారా ఈ పని చేసుకొన్నట్లయితే రైతులు రాయితీ కూడా పొందుతారు. నా పొలంలోని చెరువు పరిమాణం 250 ft X 250 ft X 28 ft ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం నుండి నాకు 100 శాతం సబ్సిడీ లభించింది. ప్రస్తుతం ఈ సబ్సిడీ పాలితిని షీట్ ఉపయోగించుకొన్నట్లయితే వ్యయంలో 50% వరకూ ఇవవ్వచ్చు.

బిందు సేద్యంతో 20 ఎకరాల భూమిని సాగు చేయటానికి ఈ వ్యవసాయ చెరువు నుండి లభించే నీరు నీటి పారుదలకు సరిపోతుంది. ప్రస్తుతం నేను ఈ నీటినుండి చెరకు, సపోటా మరియు చీని పళ్ళ సాగు చేస్తున్నాను. ఒకసారి నిర్మించుకొన్న తర్వాత కనీస నిర్వహణ మరియు రిపేరీలు అవసరమవుతాయి. నీటి నిల్వ ప్రదేశం నుండి ఊట చెమ్మ లాంటివి మరియు ఇతర నష్టాలను నివారించుకోవడానికి అధిక సాంద్రతతో కూడిన పాలీ ఎథిలీన్ పదార్థపు షీటును కప్పబడి ఉంచాలి. నేను డిపి ప్లాస్టిక్స్ రత్లాం నుండి తయారైన హెచ్ డి పి పదార్థపు షీటులను ఉపయోగించాను ఆ సమయంలో అది 10 ఏళ్లకు పైగా కొనసాగింది.

undefined
undefined

చెరువులకు తగినంత లైనింగ్ చేసుకోవడం వలన, ఊట చెమ్మ నష్టాలను తగ్గించుకోవచ్చు. చెరువులను లైనింగ్ చేసుకోవడానికి చాలా సమర్థవంతంగా ప్లాస్టిక్ లను ఉపయోగించుకోవచ్చు. కానీ చెరువులను లైనింగ్ చేసుకోవడానికి ప్లాస్టిక్ ఎంచుకోవడంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వీటిల్లో ప్లాస్టిక్ పదార్థాలు పరచడంమరియు వాటిని నష్టాల నుండి పరిరక్షించుకోవడం ముఖ్యమైనవి. ఈ కార్యక్రమ ప్రక్రియలో పాలీథీన్ ను జాగ్రత్త గ పరచాలి మరియు ఈడ్చరాదు అందువలన పొరలకు నష్టం కలగవచ్చు. పొరలు తూట్లు కాకుండా ఉండేందుకు దానిని నివారించడానికి, పనిచేయుచున్నప్పుడు, కార్మికులు పాలిథీన్ పై నడవరాదు. నదవడ్దం అత్యవసరం అయినప్పుడు చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో మాత్రమే నడవాలి. చెరువును పూర్తిగా ఏర్పాటు చేసుకొన్న తర్వాత, చెరువు జీవిత కాలాన్ని పెంచుకోవడానికి సమయానుకూలంగా అప్పుడప్పుడు తనిఖీ చేసుకొంటూ ఉండాలి. తద్వారా సకాల నిర్వహణ, ఎక్కువ కాలం చెరువు పరిరక్షణకు కారణమవుతుంది. ఇందులో తనిఖీలు, చిన్న చిన్న సమస్యలను తొలగించుకోవడం మరియు నష్టపరిహారాలకు మరమ్మత్తులను చేసుకోవడం ముఖ్యమైనవి. వెంటనే మరమ్మత్తులు క్షీణతల తనిఖీలకు అత్యవసరం దీని వలన మరిన్ని నష్టాలను నివారించుకోవచ్చు.

వ్యవసాయ చెరువుకు మెరుగైన నిర్వహణ కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

undefined
undefined

వ్యవసాయ చెరువుకు మెరుగైన నిర్వహణ కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1.చెరువు ప్రాంతమునకు సరైన ఫెన్సింగ్ చేసుకోవడం వలన జంతువుల చొరబాట్లు నుండి రక్షించుకోవచ్చు.

2.వ్యవసాయ చెరువులలో చేపలను పెంచుకోవడం ఆదాయం పెంచకోవడానికి సహాయపడుతుంది. నేను రోహూ, కాట్లా లాంటి తాజా నీటి చేపలను పెంచాను. వీటివలన కిలోకు రూ. 120 పొందాను. ఎనిమిది నెలల కాలం వాటిని పెంచిన తర్వాత ఆ పంట ఫలితం నాకు లభించింది. దీని వలన నాకు రూ. 80, 000 లభించాయి.

వ్యవసాయ చెరువులుఉ కరువును తగ్గించడానికి సమర్థవంతమైన మార్గాలుగా ఉపయోగపడతాయి మరియు వ్యవసాయపు ఆదాయమునుఉ పెంచడానికి కూడా సహాయపడతాయి.

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button