కత్తెర పురుగులు (స్పోడోప్టెరా ఫ్రెగిపెర్డా) మొక్కజొన్న, జొన్న, సజ్జలు(సోర్గమ్), వరి మరియు చెరకు వంటి పంటలపై స్థిరపడుతూ భారతదేశంలోని అనేక భాగాలను ముట్టడించింది.ఇది వినాశకారి పురుగు కావడం వలన రైతులందరూ దీనిని నివారించడానికి తమ దృష్టిని కేంద్రీకరించి జాగ్రత్తగా ప్రారంభ దశలోనే నాశనం చేయు నిర్వహణను గుర్తించడం అతి కీలకమైనది. గత సంవత్సరంలో ఈ పురుగు ను కర్ణాటకలో మొదటగా కనుగొన్నారు తర్వాత అది అతివేగంగా అనేక రాష్ట్రాలలోని పంటలకు అతి వేగంగా విస్తరించింది.
FarmRise టీం నుండి మేము అవగాహనను సృష్టించడానికి మరియు ఈ వినాశకారి పురుగు ను నిర్వహించడానికి కావలసిన సమాచారమును అందించడానికి ప్రయత్నిస్తున్నాము.
పర్యవేక్షణ, గుర్తింపు మరియు ఈ వినాశకారి పురుగు యొక్క జాడలు:
పర్యవేక్షణ, గుర్తింపు మరియు ఈ వినాశకారి పురుగు యొక్క జాడలు:
ప్రస్తుతం ఫాల్ ఆర్మీ వార్మ్ కోసం ఫెరోమోన్ వలలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెక్కల పురుగులను జాగ్రత్తగా గమనించడానికి, విత్తే ముందు కనీసం 2 వారాలు ముందుగా ఫెరోమోన్ బోనులను ఏర్పాటు చేసుకోండి. బోనును పొడవైన కర్ర పై నుండి నిలువుగా వ్రేలాడదీయండి, తద్వారా బోను భూమికి సుమారు 1.25 మీటర్లు ఎత్తులో ఉంటుంది, మొక్క మొలిచిన అయిన తర్వాత, బోను మరియు ఆకర్శించు ఎర ఎల్లప్పుడూ మొక్క ఎత్తుకంటే 30 సెం.మీ. పైన ఉండాలని గమనించండి. బోనులను కనీసం వారానికి ఒకసారి లేదా మరింత తరచుగా పర్యవేక్షించాలి. రెక్కల పురుగులు బూడిదరంగు లేదా గోధుమ రంగులో క్రమం లేని గుర్తులతో ఉంటాయి. . రెక్కల పురుగుల ఉనికి ద్వారా భవిష్యత్తులో కత్తెర పురుగు నష్టం కలిగే అవకాశం ఉందని గ్రహించాలి
లార్వాను గుర్తించడానికి ఎలా
లార్వాను గుర్తించడానికి ఎలా
కత్తెర పురుగులు లార్వాను చిత్రంలో చూపిన విధంగా గుర్తించడం సులభం .తల పైభాగాన ప్రముఖంగా “వై” రూపం ద్వారా డ్రాగన్ ఫ్లై రూపంలో ఊండే లార్వాను సులభంగా గుర్తించవచ్చు. చతురస్రంలో నాలుగు ముదురు మచ్చలు కూడా 8 వ విభాగంలో కనిపిస్తాయి. వాటి రంగు ఆకుపచ్చ నుండి ముదురు ఆకుపచ్చ రంగు వరకు మారుతుంటుంది.
నియంత్రణ చర్యలు
నియంత్రణ చర్యలు
వెంటనే నష్ట నివారణకు పురుగుల మందును పిచికారీ చేయాలి. ప్రారంభదశలోని లార్వాలలో పురుగుమందుల నియంత్రణ ప్రభావవంతంగా ఉంటుంది మరియు తరువాతి దశల్లో పెద్ద లార్వాల నియంత్రణ చాలా కష్టం ఎందుకంటే పెద్ద లార్వాలు కాడలపై దాక్కుంటాయి. అందువల్ల రైతులు పెద్ద లార్వాలు కాడలపై లోతుగా ప్రవేశించే లోపల ముందుగా సిఫార్సు చేసిన క్రిమిసంహారకాలను పిచికారి చేయాలి. రిజిస్ట్రేషన్ కమిటీ ఈవినాశకారి పురుగు కొరకు, మొక్కజొన్న పంటకు ఆమోదిత రసాయనాలను వాడటంతో పాటు కార్బోఫురాన్ మరియు ఫోరెట్ వంటి గుళికల వాడకాన్ని మరియు ఫెలియర్ పురుగుల మందులను ఎక్కువగా వాడేందుకు ఆమోదాన్ని తెలిపింది. స్థానిక రాష్ట్ర వ్యవసాయ శాఖలు మరియు విశ్వవిద్యాలయాలు సిఫార్సు చేసిన పురుగు మందులని మాత్రమే ఎంపిక చేసి సరిగ్గా పిచికారి చేయబడు సామగ్రితో మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ చేయునప్పుడు భద్రతా జాగ్రత్తలు మరియు సరైన రక్షణ చర్యలను చేపట్టాలి.
-
ఎకరానికి 80 - 100 మిలీ మోతాదు వద్ద థియామెథోక్సామ్ 12.6% + లాంబ్డా-సైహాలోథ్రిన్ 9.5% జెడ్ సి ని200 లీటర్ల ు ఉపయోగించి పిచికారీ చేయండి
-
60 ml మోతాదు వద్ద క్లోరాన్ట్రానిలిప్రోల్ 18.5% ఎస్ సి ప్రతి ఎకరానికి 150 లీటర్ల స్ప్రే ఫ్లూయిడ్ ఉపయోగించి పిచికారీ చేయండి.
-
ఎకరానికి 180 - 200 మిలీ మోతాదు వద్ద స్పైన్ టోరమ్ 11.7% ఎస్ 200 లీటర్ల స్ప్రే ఫ్లూయిడ్ ఉపయోగించి పిచికారీ చేయండి.