పాలీ హౌస్ అనేది గాజు లేదా పాలిఎథిలిన్ వంటి పారదర్శక లేదా అర్ధపారదర్శక పదార్థాలతో కప్పబడిన ఒక ఫ్రేమ్ గా చేయబడిన నిర్మాణం, దీనిలో మొక్కలు చక్కటి-నియంత్రిత వాతావరణ పరిస్థితులలో పెంచబడతాయి. గాలి, చలి, అవపాతం, అధిక రేడియేషన్, విపరీతమైన ఉష్ణోగ్రత, కీటకాలు మరియు వ్యాధుల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుండి మొక్కలను కాపాడటం కోసం ఇది ఉపయోగించబడుతుంది. మొక్కల చుట్టూ ఒక ఆదర్శవంతమైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించడం కోసం కూడా ఇది కీలక ప్రాముఖ్యత కలిగినది.
భారతదేశం లో, పాలీహౌస్ వ్యవసాయం అనేది దాని తక్కువ నిర్మాణ వ్యయం మరియు సులభ నిర్వహణ కారణంగా ఈ మధ్య చాల ప్రాచుర్యము పొందుతుంది . పాలీ హౌస్ యొక్క విస్తీర్ణం ఒక వ్యక్తి లోపల పని చేయడానికి తగినంత పెద్దదిగా ఉండాలి. సాధారణంగా వేడి చేరడం (70-75% సౌరశక్తి నిలిపి ఉంచబడుతుంది) పాలీ హౌస్ లోపల సంభవిస్తుంది. సౌర వికిరణం దాని గుండా వెళ్ళడానికి అనుమతించబడుతుంది కాని మొక్కల ఉష్ణ వికిరణాలు చిక్కుకుని ఉంటాయి. పాలి హౌస్ లోపల వాణిజ్య సాగు కోసం వెళ్ళడానికి కనీసం 500 చదరపు మీటర్లు కనీస పరిమాణం సరిపోతుంది.
పాలీహౌస్‌లో పండించబడే పంటలు
పాలీహౌస్‌లో పండించబడే పంటలు
· పండించదగిన కూరగాయల్లో కీరా దోసకాయ, సిమ్లా మిర్చి, క్యాబేజీ, టొమాటో, కాకరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్, పాలకూర మొదలైనవి ఉంటాయి.
· బొప్పాయికాయ, స్ట్రాబెర్రీ మొదలైనవి పండించదగిన పండ్లు.
· కార్నేషన్ (ఎర్ర పువ్వు), గెర్బెరా, బంతిపువ్వు, ఆర్కిడ్ మరియు గులాబివంటి పువ్వులను కూడా సులభంగా పెంచవచ్చు.
పాలీహౌస్ యొక్క ప్రయోజనాలు
పాలీహౌస్ యొక్క ప్రయోజనాలు
·రైతులకు, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ఇష్టపడే వారికి పాలీహౌస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాలీహౌస్ యొక్క ప్రయోజనాలు కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
·మీ మొక్కలు నియంత్రిత ఉష్ణోగ్రతలో పెంచబడతాయి, దానితో పంట నష్టం లేదా దెబ్బతినడం తక్కువగా ఉంటుంది.
·మీరు ఏడాది పొడవునా పంటలను పండించవచ్చు మరియు ఏదైనా నిర్దిష్ట సీజన్ కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు.
·పాలీహౌస్‌లో తక్కువ తెగుళ్ళు మరియు కీటకాలు ఉంటాయి.
· సీజన్ కాని సమయంలో కూరగాయలు / పండ్ల సాగు, ఇది రైతుకు మంచి ధర అందటానికి వీలు కల్పిస్తుంది
· పంటల పెరుగుదలపై బాహ్య వాతావరణం ఎలాంటి ప్రభావం చూపదు.
· పాలీహౌస్‌లో ఉత్పత్తి యొక్క నాణ్యత స్పష్టంగా ఎక్కువగా ఉంటుంది.
· మొక్కల మంచి పెరుగుదల కోసం మంచి నీటిపారుదల మరియు గాలి
· చక్కటి పారిశుద్ధ్యంతో పాలీ హౌస్‌ను నిర్వహించవచ్చు.
· ఒక పాలీహౌస్‌లో అలంకార పంటల పెంపకం కూడా చేయబడవచ్చు.
· పాలీ హౌస్ మీ మొక్కలకు ఏ సీజన్‌లోనైనా సరైన వాతావరణ సౌకర్యాలను అందిస్తుంది.
· ఇది సుమారు 5 నుండి 10 రెట్లు దిగుబడిని కూడా పెంచుతుంది.
· పంట వచ్చేందుకు తక్కువ సమయం
· ఎరువులు వేయడం సులభం మరియు బిందు సేద్యం సహాయంతో దానంతట అదే నియంత్రించబడుతుంది.
పాలీహౌస్ వ్యవసాయంలో సవాళ్లు
పాలీహౌస్ వ్యవసాయంలో సవాళ్లు
ఒక గ్రీన్ హౌస్లో నియంత్రిత వాతావరణ పరిస్థితులలో మొక్కలను పండిస్తూ ఉండడం వలన, దీనికిఢాని వంతు సమస్యలు కూడా ఉన్నాయి. పోషక లభ్యతను నిర్ధారించడం మరియు బోరాన్, నత్రజని, భాస్వరం, కాల్షియం, ఇనుము మరియు పొటాషియం వంటి వివిధ ఖనిజాల లోపం నుండి మొక్కలను
పాలీహౌస్ ఎలా నిర్మించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును అయితే, కథనాన్ని ఇష్టపడటానికి ♡ చిహ్నంపై క్లిక్ చేసి, తదుపరిదాన్ని చదవండి!
· పండించదగిన కూరగాయల్లో కీరా దోసకాయ, సిమ్లా మిర్చి, క్యాబేజీ, టొమాటో, కాకరకాయ, ముల్లంగి, కాలీఫ్లవర్, పాలకూర మొదలైనవి ఉంటాయి.