తిరిగి
నిపుణుల కథనాలు
వెర్మీకంపోస్ట్ యొక్క తయారీ మరియు పంటలకు దాని యొక్క ప్రయోజనం

వెర్మీకంపోస్ట్, వానపాములను వేయడం లేదా వాటి వ్యర్ధాలు అద్భుతమైన పోషక సేంద్రీయ ఎరువు మరియు మట్టి కండీషనరుగా పనిచేస్తుంది. ఐసీనియా ఫోటిడా, ఎర్ర వానపాము, లేదా ఎరుపు రిగ్లర్ మరియు లుంబ్రికస్ రుబెల్లస్ వంటి సేంద్రీయ పదార్థాన్ని తినే వానపాములు వెర్మీకంపోస్ట్ ఉత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి. వెర్మీకంపోస్ట్ అనేది ఖరీదైన మరియు హానికరమైన రసాయన ఎరువులకు చాలా చవకైన మరియు పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయం. వెర్మీకంపోస్ట్ భూమి సాగు, గాలిప్రసరణ మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల శాతాన్ని పెంచుతుంది. ఇది బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు కన్నా కంటే దాదాపు 5 రెట్లు నత్రజని, 6 రెట్లు భాస్వరం మరియు 4 రెట్లు పొటాషియం అదనంగా కలిగి ఉంటుంది. వెర్మీకంపోస్ట్ పొలం నుండి బాష్పీభవన ఉత్సర్జన నష్టాలను, వ్యాధులు, కీటకాలు-తెగుళ్ళు మరియు కలుపుల సంభవాన్ని తగ్గిస్తుంది. పంట మంచి అంకురోత్పత్తి శాతం మరియు అధిక ఉత్పత్తి నాణ్యతను పెంచుతుంది.

undefined

వెర్మీకంపోస్టింగ్ యూనిట్లకు సరైన గాలిప్రసరణ, 40-50% తేమ శాతం, 28-30°C ఉష్ణోగ్రతతో ఉన్న సరైన గాలిప్రసరణ మరియు డ్రైనేజ్ సదుపాయాలు మరియు నీడ సదుపాయం ఉండాలి. వెర్మీకంపోస్టింగును గుంటలు, ట్యాంకులు, నేల, చెక్క అలమరలు మొదలైన వాటిలో చేయవచ్చు, ముందుగా వీటి లోపలి అంచుల చుట్టూ ప్లాస్టిక్ షీట్ పెట్టి పోషకాలు బయటికి కారిపోకుండా చేయడం జరుగుతుంది.

undefined
undefined

అత్యంత సాధారణంగా ఉపయోగించబడే వెర్మీకంపోస్టింగ్ యూనిట్ ప్లాస్టిక్ వెర్మీబెడ్, ఇది 9 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు మరియు 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది, మరియు దాని ఖరీదు ఒక బెడ్డుకు దాదాపు ₹ 3500/ఉంటుంది. వెర్మీబెడ్స్ ను కొద్దిగా ఏటవాలుగా భూఉపరితలం పైకి బిగించడం జరుగుతుంది. డ్రైనేజ్ రంధ్రం భూమి యొక్క దిగువ భాగంలో ఉండాలి. ఎండుగడ్డి యొక్క మొదటి పొర బెడ్ లో పరచబడుతుంది, తరువాత వేపాకులు పరవబడతాయి. నీటితో తడపండి. ఒకవారం రోజుల నాటి ఆవు పేడ (దాదాపుగా 6-7 క్వింటాళ్ళు) జోడించండి. ఆవుపేడ స్వచ్ఛమైన పొలం మట్టితో లేదా రాక్ ఫాస్ఫేటుతో 3:1 నిష్పత్తిలో కలపబడుతుంది. నీరు చల్లండి. ఆ తరువాత దాదాపు 5 kg వానపాములను వేయండి. ఎందుగడ్డితో కప్పండి. నీరు చల్లండి. చివరిగా తడి జూట్ సంచులతో కప్పండి. వెర్మీ కంపోస్ట్ బెడ్లను పైవరకు నింపవద్దు, ఎల్లప్పుడూ పైవైపు నుండి 4 అంగుళాల ఖాళీ వదలండి. క్రమంతప్పకుండా వాటరింగ్ చేయాలి: శీతాకాలంలో 2-3 రోజులకొకసారి, వేసవిలో ప్రతిరోజూ, వర్షాకాలంలో వాటరింగ్ అవసరం లేదు. వీలైనంత వరకు వెర్మీబెడ్స్ లోని వానపాములను కదిలించవద్దు. దాదాపు 3నెలల్లో వెర్మీకంపోస్ట్ సిద్ధమవుతుంది.

undefined
undefined

వెర్మీకంపోస్ట్ యొక్క తయారీ మరియు పంటలకు దాని యొక్క ప్రయోజనం

ఈ వెర్మీకంపోస్టును 2 mm జల్లెడతో జల్లించి దాన్ని పాలిథీన్ ప్యాకెట్లలో నింపండి. బెడ్ ల ఉండిపోయిన వానపాములను మరలా అదే ప్రక్రియతో ఉపయోగించవచ్చు. రెండవసారి వెర్మీకంపోస్ట్ రెండున్నర నెలల్లో సిద్ధమవుతుంది, మూడవసారి 2 నెలల్లో సిద్ధమవుతుంది, ఆ తరువాత ప్రతి 45-60 రోజులకు ఒకసారి మనం వెర్మీకంపోస్టును పంటగా తీసుకోవచ్చు. కాబట్టి, ఒక సంవత్సరంలో మనం వెర్మీకంపోస్ట్ యొక్క 4-6 ఉత్పత్తి చక్రాలను పొందవచ్చు. ప్రతి ఒక్క క్వింటాలు ఆవుపేడకు మనం 70 kg వరకు వెర్మీకంపోస్టును సాగు చేయవచ్చు. వెర్మీబెడ్ యొక్క డ్రైనేజ్ పైప్ నుండి సాధించబడిన ద్రవ సారాన్ని వెర్మీవాష్ అంటారు. ఇది మొక్క ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉండే స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలు, జీవక్రియ పదార్థాలు, ఎంజైములు మరియు విటమిన్లను కలిగి ఉండే అద్భుతమైన ద్రవ ఎరువు. రైతులు తమ స్వంత పొలాలతో పాటుగా వాణిజ్యపరంగా కూడా వెర్మీకంపోస్టింగ్ చేయవచ్చు. వెర్మీకంపోస్ట్ సంచులు మార్కెట్టులో కేజీకి రూ. @ ₹10/ kg 10 మరియు వెర్మీవాష్ లీటరుకు రూ. @ ₹ 200-300/ చొప్పున అమ్మబడుతున్నాయి.

డాక్టర్ పాయల్ సక్సేనా

వెర్మీకంపోస్ట్, వానపాములను వేయడం లేదా వాటి వ్యర్ధాలు అద్భుతమైన పోషక సేంద్రీయ ఎరువు మరియు మట్టి కండీషనరుగా పనిచేస్తుంది. ఐసీనియా ఫోటిడా, ఎర్ర వానపాము, లేదా ఎరుపు రిగ్లర్ మరియు లుంబ్రికస్ రుబెల్లస్ వంటి సేంద్రీయ పదార్థాన్ని తినే వానపాములు వెర్మీకంపోస్ట్ ఉత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి. వెర్మీకంపోస్ట్ అనేది ఖరీదైన మరియు హానికరమైన రసాయన ఎరువులకు చాలా చవకైన మరియు పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయం. వెర్మీకంపోస్ట్ భూమి సాగు, గాలిప్రసరణ మరియు ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల శాతాన్ని పెంచుతుంది. ఇది బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు కన్నా కంటే దాదాపు 5 రెట్లు నత్రజని, 6 రెట్లు భాస్వరం మరియు 4 రెట్లు పొటాషియం అదనంగా కలిగి ఉంటుంది. వెర్మీకంపోస్ట్ పొలం నుండి బాష్పీభవన ఉత్సర్జన నష్టాలను, వ్యాధులు, కీటకాలు-తెగుళ్ళు మరియు కలుపుల సంభవాన్ని తగ్గిస్తుంది. పంట మంచి అంకురోత్పత్తి శాతం మరియు అధిక ఉత్పత్తి నాణ్యతను పెంచుతుంది.

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button