తిరిగి
నిపుణుల కథనాలు
కాయగూరల పంటల్లో ఫెరోమోన్ ట్రాప్స్ మరియు ఇతర ట్రాప్స్ ల వినియోగం

పురుగుల-కీటకాల నియంత్రణకు కీటకాల ట్రాప్స్ పర్యావరణానికి అనుకూలమైనవి మరియు ఇది చౌకైన విధానం. రసాయనిక పురుగుమందుల అనవసర అధిక ఉపయోగం పంట పెట్టుబడి వ్యయాన్ని పెంచుతుంది మరియు మట్టి నాణ్యతకు హాని కలిగించేదిగానూ అంతేకాకుండా మానవుల అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. కీటకాలు ఆర్ధికపరంగా హాని దశను చేరే వరకు రసాయనాలను వాడకూడదు.

ట్రాప్స్ లను కీటకాలను సామూహికంగా పట్టుకోవడానికి, చంపడానికి మరియు కీటకాల పర్యవేక్షణకు ఉపయోగిస్తారు. పంటపొలంలోని వేర్వేరు చోట్లలో కీటకాల సంఖ్యను గుర్తించడం వలన, పురుగుమందులను పిచికారీ చేయడానికి సరైన సమయాన్ని మనము నిర్ణయించుకోగలగుతాము మరియు కొన్ని చోట్ల ఎక్కువగా రసాయన పిచికారి అవసరం అవుతుంది, అంతేకానీ పూర్తి పొలానికి పిచికారి చేయనవసరం ఉండదు.

undefined

కీటకాలు ఒక ప్రత్యేకమైన ఫేరోమోన్, రంగు, కాంతి, ఆహారం లేదా కోజీ షెల్టర్ వైపు ఆకర్షించబడతాయి. ఈ ఆకర్శితాలకు అనుగుణంగా కీటకాల ట్రాప్ లను వివిధ విధాలుగా ఉపయోగింఛబడతాయి.

ఫెరోమోన్ ట్రాప్స్

ఫెరోమోన్ ట్రాప్స్

ఫెరోమోన్ ట్రాప్స్ సాధారణంగా కమ్యూనికేషన్ కోసం ఫేరోమోన్లను విడుదల చేసే కీటకాల కోసం ఉపయోగిస్తారు. ఫెరోమోన్స్ మేటింగ్ కోసం (సెక్స్ ఫేరోమోన్స్) వాటి భాగస్వాములను ఆకర్షించడానికి, ఇతర కీటకాలను ప్రమాదాల నుండి హెచ్చరించడానికి, మార్గదర్శకాలను ఇవ్వడానికి మరియు తమను తాము కూడగట్టుకోవడానికి విడుదల చేయవచ్చు.

లార్వా వలన నష్టం కలిగించే పంటలలో సెక్స్ ఫేరోమోన్స్ అత్యంత ప్రభావవంతమైనవి. పెరోమోన్ ట్రాప్ అనేది ఎరలాగా లేదా రబ్బరు సెప్టాపై ఆడ సెక్స్ ఫేరోమోన్ లాగా మగ కీటకాలను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. అందులో మగ కీటకాలు చిక్కుకొంటాయి మరియు వెలుపలవైపు ఉండే ఆడకీటకాలను మేటింగ్ కాకుండా గర్భధారణను మరియు గుడ్లు పెట్టకుండానూ నిరోధించబడతాయి.

ఫెరోమోన్స్ కృత్రిమంగా సమన్వయం చేయబడతాయి మరియు ఇవి టొబాకో గొంగళి పురుగు, వంకాయలకు షూట్ బోరర్, డైమండ్ బ్యాక్ మోత్, బీట్ ఆర్మీ వార్మ్, లెగ్యుమ్ పాడ్ బోరెర్, క్యాబేజ్ లీఫ్ రోలర్, క్యాబేజ్ మోత్, పీ మోత్, బంగాళాదుంపల మోత్ వంటి పలు కీటకాల నివారణలకు అందుబాటులో ఉంటాయి. అలారం మరియు అగ్రిగేషన్ ఫేరోమోన్స్ సామూహిక కీటక బందనముల కొరకు ఉపయోగించబడతాయి, అవి మగ మరియు ఆడ కీటకాలు కావచ్చు. ఉదాహరణకు వీవిల్స్.

undefined
undefined

లైట్ ట్రాప్స్

లైట్ ట్రాప్స్

రాత్రి సమయంలో బయటకు వచ్చి వెలుతురు వైపు ఆకర్షించబడే కీటకాల నివారణకు లైట్ ట్రాప్స్ మంచివి. వెలుతురు మూలాలు UV కాంతి, ఫ్లోరసెంట్ దీపాలు, మెర్క్యూరీ ఆవిరి దీపాలు, లైట్ ఎమిషన్ డయోడ్లు మొదలైనవి కావచ్చు. వీటిని ఆర్మీ వార్మ్, బగ్స్, లీఫ్ హాపెర్స్, ప్లాంట్ హాప్పర్లు, స్టెమ్ బోరర్లు మొదలైన ఎగిరే కీటకాల నివారణకు ఉపయోగిస్తారు. పిట్ ఫాల్ ట్రాప్స్ భూమిపై ప్రాకుతూ జరిగేటటువంటి

undefined
undefined

గుంత / పిట్ ఫాల్ ట్రాప్స్

గుంత / పిట్ ఫాల్ ట్రాప్స్

కీటకాల నివారణకు ఉపయోగిస్తారు ఉదాహరణకు గ్రౌండ్ బీటిల్స్. మట్టిని త్రవ్వడం ద్వారా చిన్న గుంతలను తయారు చేసుకోవాలి, ఇందులో కొంత నీటిని మరియు డిటర్జెంట్లు ఉంచిన చిన్న డబ్బాను దాని పైభాగాన్ని నోరు తెరిచి ఉండేటట్లు ఉంచుతారు. భూమిపై ప్రాకుతూ జరిగేటటువంటి కీటకాలు ఇందులోనికి వస్తాయి అటుతర్వాత అవి అటుతర్వాత వెలుపలకు రాలేవు.

undefined

బైట్ ట్రాప్స్

బైట్ ట్రాప్స్

బైట్ ట్రాప్స్ ప్రత్యేకమైన ఆహారం వైపు ఆకర్షించబడే కీటకాల నివారణకు ఉపయోగిస్తారు.కుళ్ళిన లేదా చెడిపోయిన పండ్ల వాసనను ఆకర్షించే ఫ్రూట్ ఫ్లైస్ విషయంలో, చిన్న రంధ్రాలతో ఉన్న ప్లాస్టిక్ సీసాలలో పాక్షికంగా నింపబడు ఆపిల్ సైడర్ వెనీగర్ లేదా కొంత పశువుల మూత్రం, కుళ్ళిన పండ్లు లేదా చనిపోయిన చేపలు,వాటితో పాటు కొంత డిటర్జెంట్లు నింపి, దానిని చెట్లలో వేలాడదీస్తారు. ఈగలు జార్లు / సీసాలలోనికి ప్రవేసిస్తాయి అటుతర్వాత అవి వెలుపలికి వెళ్ళలేవు.

undefined

స్టికీ ట్రాప్స్

స్టికీ ట్రాప్స్

స్టికీ ట్రాప్స్ కీటకాలు ఇష్టపడే రంగు ప్రయోజనాన్ని ఉపయోగించుకుంటాయి. రంగు కార్డులకు కొంత అంటుకునే జిగురుతో పూత వేయబడుతుంది అవి పొలాలలో పలు వేర్వేరు ప్రాంతాల్లో వ్రేలాడదీయబడతాయి, అఫిడ్స్ మరియు లీఫ్ హాపర్స్ కొరకు పసుపుపచ్చని కార్డులు, త్రిప్స్ కొరకు నీలి కార్డులు, మరియు తెలుపు ఈగలకోసం నారింజ కార్డులు వాడతారు.

undefined
undefined

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button