Back తిరిగి
ప్రభుత్వ పథకాలు
Govt. Scheme
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్)

ఈ యోజన వివరాలు ముందు ఈ “https://www.pmkisan.gov.in " వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యాయి . మరిన్ని వివరాలకు ఈ “https://www.pmkisan.gov.in “వెబ్ సైట్ చుడండి.

చిన్న మరియు సన్నకారు రైతు కుటుంబాలకు ఆదాయ ఆసరా కల్పించడానికి వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలు మరియు వ్యవసాయ అవసరాలకు సంబంధించిన వివిధ పెట్టుబడులను సమకూర్చేందుకు వారి ఆర్థిక అవసరాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఆరంభించింది. ఈ పథకం క్రింద, లబ్ధిదారులకు మొత్తం ఆర్థిక పెట్టుబడి ప్రయోజనం బదిలీ చెయ్యడాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంది. అర్హత: 01.02.2019 నాటికి రాష్ట్రాలు / UT రికార్డుల్లో 2 హెక్టార్ల వరకు సాగు చెయ్యడానికి వీలుగా ఉన్న భూమిని కలిగి ఉన్న అన్ని రైతు కుటుంబాలు ఈ పథకం కింద లాభం పొందడానికి అర్హులు. అయితే, వీటిలో, క్రింది వారు ప్రయోజనాలు పొందడానికి అనర్హులు: (a) అందరు సంస్థాగత భూస్వాములు; మరియు (b) రైతు కుటుంబాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు క్రింది వర్గాలకు చెందిన రైతు కుటుంబాలు అనర్హులు:- i. మాజీ మరియు ప్రస్తుత రాజ్యంగ బద్దమైన పదవుల్లో ఉన్నవారి కుటుంబానికి ii. మాజీ మరియు ప్రస్తుత మంత్రులు / రాష్ట్ర మంత్రులు మరియు మాజీ / ప్రస్తుత అసెంబ్లీ/ రాష్ట్ర అసెంబ్లీ సభ్యులు, మాజీ మరియు ప్రస్తుత మున్సిపల్ కార్పోరేషన్ యొక్క మేయర్లు, 4 కొరకు. ఒక సంవత్సరంలో ఎన్ని సార్లు ప్రయోజనం చేకూరుస్తారు? మరియు ప్రస్తుత జిల్లా పంచాయితీల అధ్యక్షులు. iii. సెంట్రల్ / స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ / కార్యాలయాలు / డిపార్ట్ మెంట్స్ మరియు దాని క్షేత్ర యూనిట్లు సెంట్రల్ లేదా స్టేట్ PSE లు మరియు ప్రభుత్వ కార్యాలయాలు / స్థానిక సంస్థల యొక్క సాధారణ ఉద్యోగులు మరియు విరమణ పొందిన అధికారులు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్ / క్లాస్ IV / గ్రూప్ D ఉద్యోగులు ఈ జాబితాలోకి రారు) iv. నెలవారీ పెన్షన్ రూ. 10,000 /- లేదా అంతకంటే ఎక్కువ పొందే అందరు ఉద్యోగ విరమణ / రిటైర్డ్ పెన్షనర్లు (మల్టీ టాస్కింగ్ స్టాఫ్ / క్లాస్ IV / గ్రూప్ D ఉద్యోగులు ఈ జాబితాలోకి రారు) v. చివరి ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను చెల్లించిన అన్ని వ్యక్తులు. vi. వృత్తిపరమైన సంస్థలతో నమోదు చేసుకున్న ప్రాక్టీసు ద్వారా వృత్తిని నిర్వహిస్తున్న వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్స్, మరియు ఆర్కిటెక్ట్స్ వంటి వారు

ప్రయోజనాలు: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చిన్న మరియు సన్నకారు రైతులకు హామీ ఇచ్చే ఆదాయాన్ని అందిస్తుంది. 2 హెక్టార్లు సాగుచేయ్యడానికి వీలు కలిగిన భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతు (SMF) లకు రూ. 6000 ఆర్థిక సహాయాన్ని అందించబడుతుంది. అందాల్సిన మొత్తాన్ని 3 వాయిదాల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారు పథకం కోసం రూ. 75,000 కోట్ల పూర్తి వ్యయం 2019-20 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం క్రింద 12 కోట్ల కంటే ఎక్కువ రైతు కుటుంబాలకు ప్రయోజనం చెకూరుతుంది.

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button
app_download
stars ఇతర ఉచిత ఫీచర్లు stars
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి