Back తిరిగి
ప్రభుత్వ పథకాలు
Govt. Scheme
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)

ఈ యోజన వివరాలు ముందు ఈ “Press Information Bureau, Government Of India” వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యాయి . మరిన్ని వివరాలకు ఈ “http://pib.nic.in/newsite/erelease.aspx?relid=116207” వెబ్ సైట్ చుడండి

“ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) యొక్క లక్ష్యాలు - సహజ విపత్తులు మరియు చీడపీడల ఫలితంగా ఏదైనా నోటిఫైడ్ పంట విపలమైనప్పుడు రైతులకు బీమా కవరేజీ మరియు ఆర్థిక మద్దతు అందించడానికి.

  • రైతులు వ్యవసాయం చేయడాన్ని కొనసాగించేలా చూడటం కొరకు వారి ఆదాయాన్ని స్థిరీకరించడం
  • సృజనాత్మక మరియు ఆధునిక వ్యవసాయ విధానాలను స్వీకరించేవిధంగా రైతులను ప్రోత్సహించడం కొరకు
  • వ్యవసాయ రంగానికి పరపతి అందేలా చూడటం కొరకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద కవర్ అయ్యే పంటలు
  1. ఆహార పంటలు (తృణధాన్యాలు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలు)
  2. నూనెగింజలు
  3. వార్షిక వాణిజ్య/వార్షిక తోట పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద రిస్క్ యొక్క కవరేజీ మరియు మినహాయింపులు
  1. పంట యొక్క దిగువ దశలు మరియు పంట నష్టానికి దారితీసే ప్రమాదాలు పథకం కింద కవర్ చేయబడతాయి a) నాట్లు వేయడం/విత్తనాలు నాటకుండా నిరోధించే ప్రమాదం: వర్షాభావ పరిస్థితులు లేదా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల బీమా చేయబడ్డ ప్రాంతం నాటడం/విత్తడానికి అనుకూలంగా లేకపోవడం b) ఎదిగిన పంట (విత్తడం నుంచి కోత వరకు): నియంత్రించలేని ప్రమాదాలు అంటే కరువు, పొడిగా ఉండేకాలాలు, వరదలు, జలప్రళయం, చీడపీడలు, కొండచరియలు విరిగిపడటం, సహజంగా మంటలు చెలరేగడం మరియు మెరుపులు, తుపాను, వడగండ్ల వాన,గాలివాన,ఉప్పెన, సుడిగాలి వంటి వల్ల కలిగే నష్టాలకు సమగ్ర రిస్క్ బీమా అందించబడుతుంది. c) కోత అనంతరం నష్టాలు: పంటను కోసిన తరువాత ఎండబెట్టాల్సిన అవసరం ఉండే పంటలకు మరియు తుపాను మరియు తుపాను వర్షాలు మరియు అకాల వర్షాలు వంటి నిర్ధిష్ట విపత్తుల నుంచి పంటను కోసినప్పటి నుంచి గరిష్టంగా రెండువారాల కాలం వరకు మాత్రమే ఈ కవరేజీ లభ్యం అవుతుంది.d) స్థానిక విపత్తులు: నోటిఫై చేయబడ్డ ప్రాంతంలో పంటలపై ప్రభావం చూపించే స్థానికంగా గుర్తించబడ్డ ప్రమాదాలైన వడగండ్ల వాన, కొండచరియలు విరిగిపడటం మరియు జలప్రళయం ఫలితంగా నష్టం/డ్యామేజీ
  2. సాధారణ మినహాయింపులు: దిగువ విపత్తుల నుంచి ఉత్పన్నం అయ్యే రిస్క్‌లు మరియు నష్టాలు మినహాయించబడతాయి: యుద్ధం మరియు జాతుల వైరుధ్యం వల్ల విపత్తులు, అణు విపత్తులు, అల్లర్లు, మోసపూరితంగా నష్టం కలిగించడం, చౌర్యం, శత్రుత్వ చర్య, పెంపుడు మరియు/లేదా వన్యమృగాల ద్వారా మేయడం మరియు/లేదా నష్టం కలిగించడం, కోత అనంతరం నష్టాల విషయానికి వస్తే, కోత కోయబడ్డ పంట నూర్చడానికి ముందు, ఒక చోట చోటుకు చేర్పి, మోపుగా వేయడం, ఇతర నిరోధించదగ్గ ప్రమాదాలు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా కింద బీమా మొత్తం/కవరేజీ లిమిట్
  3. ప్రతి హెక్టారుకు బీమామొత్తం అనేది రుణం తీసుకున్న మరియు రుణ తీసుకొని రైతులకు ఒకేవిధంగా ఉంటుంది మరియు డిస్ట్రిక్ట్ లెవల్ టెక్నికల్ కమిటీ ద్వారా నిర్ణయించబడ్డ సేల్స్ ఆఫ్ ఫైనాన్స్‌కు సమానంగా ఉంటుంది, మరియు SLCCCI ద్వారా ముందుగా డిక్లేర్ చేయబడుతుంది మరియు నోటిఫై చేయబడుతుంది. ఎలాంటి ఇతర సేల్స్ ఆఫ్ ఫైనాన్స్ కాలిక్యులేషన్‌లు వర్తించబడవు. వ్యక్తిగత రైతు కొరకు బీమా చేయబడ్డ మొత్తం ప్రతి హెక్టార్ యొక్క సేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ఇంటూ బీమా కొరకు రైతు ద్వారా ప్రతిపాదించబడ్డ నోటిఫైడ్ పంట యొక్క విస్తీర్ణం యొక్క మొత్తానికి సమానం అవుతుంది. ‘సాగు చేయబడుతున్న ప్రాంతం’ ఎల్లప్పుడూ ‘హెక్టారు’ లోనే తెలియజేయాలి.
  4. సాగునీరు ఉన్న మరియు సాగునీరు లేని ప్రాంతాలకు బీమా చేయబడ్డ మొత్తం వేరుగా ఉండవచ్చు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యొక్క ప్రీమియం రేట్లు మరియు ప్రీమియం సబ్సిడీ1. PMFBY ద్వారా ప్రయోగాత్మక ప్రీమియం రేటు (APR) అమలు ఏజెన్సీ (IA) ద్వారా వసూలు చేయబడుతుంది. రైతు ద్వారా చెల్లించాల్సిన బీమా వ్యయాలు దిగువపేర్కొన్నవిధంగా ఉంటాయి. సీజన్ - ఖరీఫ్ పంటలు: ఆహారం & నూనెగింజల పంటలు (అన్ని పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, & నూనెగింజలు, పప్పుధాన్యాలు) రైతు ద్వారా చెల్లించే గరిష్ట బీమా ఛార్జీలు (బీమా మొత్తం యొక్క % ): బీమా మొత్తం యొక్క 2.0% లేదా యాక్ట్యువేరియల్ రేటు, ఏది తక్కువ అయితే అది . సీజన్ - రబీ పంటలు: ఆహారం & నూనె గింజల పంటలు (అన్ని పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, & నూనెగింజలు, పప్పుధాన్యాలు) రైతు ద్వారా గరిష్టంగా చెల్లించబడే బీమా ఛార్జీలు (బీమా మొత్తం యొక్క % ): బీమా మొత్తం యొక్క 1.5% లేదా యాక్ట్యువేరియల్ రేటు, ఏది తక్కువ అయితే అది సీజన్ - ఖరీఫ్ & రబీ పంటలు: వార్షిక వాణిజ్య/వార్షిక తోట పంటలు రైతు ద్వారా గరిష్టంగా చెల్లించబడే బీమా ఛార్జీలు (బీమా మొత్తం యొక్క %): బీమా మొత్తం యొక్క 5% లేదా యాక్ట్యువేరియల్ రేటు, ఏది తక్కువ అయితే అది ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కొరకు దరఖాస్తు ఫారాలు దిగువ లింక్ వద్ద లభ్యం అవుతాయి : http://www.aicofindia.com/AICEng/Pages/DownloadForm.aspx మరిన్ని వివరాల కొరకు, దయచేసి దిగువ వెబ్‌సైట్‌ని సందర్శించండి: http://www.aicofindia.com/AICEng/Pages/PMFBY-OPERATIONAL-GUIDELINES.aspx "

మా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రయాణంలో వ్యవసాయం: మా యాప్‌తో ఎప్పుడైనా, ఎక్కడైనా నిజ-సమయ మార్కెట్ డేటాను యాక్సెస్ చేయండి. మీ భాషలో కూడా అందుబాటులో ఉంది.

google play button
app_download
stars ఇతర ఉచిత ఫీచర్లు stars
యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి