ఈ యోజన వివరాలు ముందు ఈ “Press Information Bureau, Government Of India” వెబ్ సైట్ లో పబ్లిష్ అయ్యాయి . మరిన్ని వివరాలకు ఈ “Press Information Bureau, Government Of India” వెబ్ సైట్ చుడండి
“ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన - ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY) అనేది 2015 కేంద్ర బడ్జెట్‌లో భారత ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఒక సామాజిక భద్రతా పధకం. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకు అర్హత: బ్యాంకు ఖాతాను కలిగిన 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయలు అందరికి లభ్యం అవుతుంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన యొక్క ప్రీమియం: సంవత్సరానికి 12 రూపాయలు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కోసం ప్రీమియం చెల్లింపు విధానం: చందాదారుల యొక్క ఖాతా నుంచి బ్యాంకు ద్వారా నేరుగా ప్రీమియం ఆటో డెబిట్ చేయబడుతుంది. ఈ చెల్లింపు విధానం మాత్రమే లభ్యం అవుతోంది. ప్రధానమంత్రి రక్షా బీమా యోజన కోసం రిస్క్ కవరేజ్ నిబంధనలు: ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యతకు -రూ .2 లక్షలు మరియు పాక్షికంగా వైకల్యతకు – రూ.1 లక్ష. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకు అర్హత: ఏ వ్యక్తి అయినా బ్యాంకు అకౌంట్ కలిగి ఉండి,బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబరు జతచేయబడి ఉన్నట్లయితే, పథకంలో చేరడం కొరకు ప్రతి సంవత్సరం జూన్ 1 వతేదీకి ముందుగా ఒక నమూనా ఫారాన్ని బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారంలో నామినీ యొక్క పేరును పేర్కొనాలి. ప్రధానమంత్రి రక్షా బీమా యోజన కోసం రిస్క్ కవరేజ్ నిబంధనలు: ఒక వ్యక్తి ప్రతి సంవత్సరం ఈ పథకాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అతడు కొనసాగడం కొరకు దీర్ఘకాల ఆప్షన్‌ని కూడా ఎంచుకోవచ్చు, అటువంటి సందర్భంలో బ్యాంకు ద్వారా ప్రతి సంవత్సరం అతడి అకౌంట్ ఆటో డెబిట్ చేయబడుతుంది. ప్రధానమంత్రి రక్షా బీమా యోజనను ఎవరు అమలు చేస్తారు? అన్ని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు మరియు పథకంలో చేరాలని కోరుకునే మరియు ఈ ఉద్దేశ్యంతో బ్యాంకులతో టైప్‌అప్‌లు పెట్టుకున్న ఇతర అన్ని బీమా సంస్థల ద్వారా పథకం అందించబడుతుంది. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కోసం ప్రభుత్వ సహకారం: (i) వివిధ మంత్రిత్వశాఖలు తమ తమ బడ్జెట్‌ల నుంచి తమ లబ్ధిదారులకు విభిన్న కేటగిరీల కొరకు ప్రీమియంకు సహకారం అందిస్తాయి లేదా క్లెయిం చేసుకొని డబ్బు నుంచి ఈ బడ్జెట్‌లో పబ్లిక్ వెల్‌ఫేర్ ఫండ్ సృష్టించబడింది. సంవత్సరం మధ్యలో ఇది ప్రత్యేకంగా నిర్ణయించబడుతుంది. (ii) సాధారణ ప్రచార వ్యయాలను ప్రభుత్వం భరిస్తుంది. ప్రధానమంత్రి రక్షా బీమా యోజన కొరకు దరఖాస్తు ఫారాలు ఈ క్రింది లింక్‌లో లభ్యం అవుతాయి: http://www.jansuraksha.gov.in/Forms-PMSBY.aspx. మరిన్ని వివరాల కొరకు, దయచేసి దిగువ వెబ్‌సైట్‌ని సందర్శించండి :http://www.jansuraksha.gov.in/ "